బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఇప్పుడు వరకు కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమతమ దేశాల్లో దేశీయ క్రికెట్ లీగ్ లను నిర్వహిస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో యూఏఈ క్రికెట్ బోర్డు సైతం ఇలాంటి దేశవాళీ టోర్నీని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో యూఏఈ టి20 లీగ్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయింది అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన టోర్నీ ప్రారంభం కాబోతున్న ఉండగా ఇక ఫిబ్రవరి 12వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.


 ఈ క్రమంలోనే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ20 లీగ్లో ఇక ఆరు జట్లు పాల్గొంటున్నాయి అన్నది తెలుస్తుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ లీగ్లో 5 జట్లను కూడా భారత్ కు చెందిన సంస్థలు కొనుగోలు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల యాజమాన్యాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్రైడర్స్ గ్రూప్, జిఎంఆర్ యూఏఈ క్రికెట్ లీగ్ లో 3 జట్లను కొనుగోలు చేయగా.. అదాని స్పోర్ట్స్ లైన్, క్యాపి గ్లోబల్ లాంటి భారతీయ కంపెనీలు మరో రెండు జట్లను కొనుగోలు చేయడం గమనార్హం. ఇక ఆరవ జట్టును మాంచెస్టర్ యునైటెడ్ కు చెందిన లాన్సర్ క్యాపిటల్ దక్కించుకుంది.


 అయితే ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ యూఏఈ లో  నిర్వహించగా.. దేశవాళీ క్రికెట్ లీగ్  ఎంత సమర్థవంతంగా నిర్వహించాలి అన్న అనుభవం యూఏఈ బోర్డుకు వచ్చింది. ఈ క్రమంలోనే సొంతంగా లీగ్ ప్రారంభించి దాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరి కొత్తగా ప్రారంభమైన ఈ టీ20 లీగ్ ఎలా సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Uae