భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఒకసారి అడిగితే చాలు అని అంటూ ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆశపడుతుంటారు అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఐపీఎల్ లో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు. కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం ఇక ధోనీ కెప్టెన్సీలో ఆడుతూ మరింత అనుభవాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ గురించి దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ప్రీటోరియస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సదరు ఆల్రౌండర్ ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది అంటూ తెలిపాడు.


 ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా 15వ సీజన్లో చెన్నై తరఫున ఆడాడు ఈ ఆల్రౌండర్. వైఫల్యం నుంచి అటు జట్టును సానుకూల పరిస్థితుల్లోకి తీసుకెళ్లడం లో ఎప్పుడూ ధోని కూల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఒక్క సీజన్ విఫలం అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ధోనీ ఎప్పుడు ఆశావాద దృక్పథంతో జట్టును ముందుకు నడిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రిటోరియా ఒకసారి అనుకున్నాడు అంటే తాను ఏదైనా చేయగలుగుతా అని ధోని ఫిక్స్ అయి పోతూ ఉంటాడు.


 ఇలా తాను చెప్పిన క్వాలిటీస్ అన్ని కూడా ధోనీ నుంచి నేను నేర్చు  కోవాలి అనుకుంటున్నాను అంటూ ప్రిటోరియా తెలిపాడు అని చెప్పాలి.  అంతేకాకుండా బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శన మిడిలార్డర్లో ఉన్నవారిపై ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.  చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం ఉంటుందని.. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తాడు అంటూ చెప్పుకొచ్చాలీ ఇక మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న సుదీర్ఘమైన అనుభవం లోకీ ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: