టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ భారత క్రికెట్ లో ఎక్కువగా జరుగుతోంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు మాత్రం లేవు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్న వయసు దృశ్య ఎక్కువ కాలం కెప్టెన్గా కొనసాగడం మాత్రం కష్టమే. ఈ క్రమంలోనే  ఫ్యూచర్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అన్న చర్చ మొదలవుతుంది. అయితే వైస్ కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించి సౌత్ఆఫ్రికా పర్యటనలో చేతులు కాల్చుకుంది బీసీసీఐ. ఇక ఇప్పుడు మరో సారి కేఎల్ రాహుల్ సొంత గడ్డపై టీ20 సిరీస్ కెప్టెన్గా వ్యవహరించ పోతున్నాడు.  ఈ క్రమంలోనే 3 ఫార్మాట్లోకి టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన ఆరో భారత క్లియర్ గా నిల్వబోతున్నాడు కె.ఎల్.రాహుల్.


 ఇంతకుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్,ఆజింక్య రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ లిస్టులో కె.ఎల్.రాహుల్ కూడా చేరిపోయాడు. అయితే అటు ఐపీఎల్లో లక్నో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కె.ఎల్.రాహుల్ ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో కె.ఎల్.రాహుల్ ముందువరుసలో ఉన్నాడని మిగతా అందరూ కూడా అతని వెనకే ఉన్నారని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.


 అదే సమయంలో మొన్నటి వరకు అసలు కెప్టెన్సీ రేసుతో సంబంధం లేని హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్  జట్టుకు కెప్టెన్గా సక్సెస్ అయి జట్టుకు టైటిల్ అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాదు కెప్టెన్సి రేస్ లోకి కూడా వచ్చేసాడు. ఇక హార్దిక్ పాండ్యా కాకుండా రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్  లాంటి వాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: