మొన్నటివరకు టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన హార్థిక్ పాండ్య సంపాదించిన గుర్తింపు ఒక ఎత్తయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మారిపోయి ఏకంగా తొలి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ ను అందించిన కెప్టెన్గా నిలిచి సంపాదించుకున్న గుర్తింపు మరోఎత్తు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా గురించి విషయం తెరమీదకి వచ్చిన వైరల్ గా  హాట్ టాపిక్ గా మారిపోతుంది.  ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అన్న చర్చ మొదలయింది. అయితే హార్దిక్ పాండ్యాకు ధోని అత్యంత సన్నిహితుడు.


 అంతేకాదు ధోని క్రికెట్  చూస్తూనే హార్థిక్ పాండ్య గొప్ప క్రికెటర్ గా ఎదిగాడు. ధోని దగ్గర ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నాడు. హార్దిక్ సక్సెస్ కావడానికి కూడా ధోని కారణం అంటూ ఇటీవల చెప్పాడు. దీంతో ఇక హార్దిక్ పాండ్యా ఫేవరెట్ క్రికెటర్ ధోని అని అందరూ ప్రేక్షకులు భావించారు. ఒకవేళ ధోని కాకపోయి ఉంటే సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు అయి ఉంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు ఎవరు కాకుండా కొత్త పేరును చెప్పాడు హార్థిక్ పాండ్య. తన ఫేవరెట్ క్రికెటర్ ఏకంగా వసీం జాఫర్ అంటూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.


 ఈ క్రమం లోనే ఇటీవలే హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ నాకు కూడా జక్వాస్ కల్లాస్,  సచిన్ విరాట్ లాంటి క్రికెటర్ల ఆట అంటే ఎంతో ఇష్టం.. కానీ నా ఫేవరెట్ క్రికెటర్ మాత్రం వసీం జాఫర్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. వసీం జాఫర్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. అతను ఒక లెజెండరీ క్రికెటర్ ఇక ఎన్నో సందర్భాల్లో నేను జాఫర్ బ్యాటింగ్ స్టైల్ కాపీ కొట్టాలని అనుకున్నా కానీ అతడిలా బ్యాటింగ్లో క్లాస్ మాత్రం అందుకోలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: