ఐపీఎల్ సీజన్ 15 తరువాత అన్ని కొన్ని టీం లు తమ జాతీయ జట్టుల మ్యాచ్ లతో బిజీగా ఉన్నాయి. ఇక ఇండియా కూడా సౌత్ ఆఫ్రికాతో రేపటి నుండి స్టార్ట్ కానున్న 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ తో ఆరంభం కానుంది. అందులో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా సాయంత్రం మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. అయితే ఇంతలోనే భారత్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్ గా కె ఎల్ రాహుల్ ను నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ కు గాయం కావడం, అది తీవ్రం కావడంతో ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని అధికారికంగా బీసీసీఐ ప్రకటించింది. ఈ వార్త విన్న భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అయితే రాహుల్ కు గాయాలు ఏమీ కొత్త కాదు. ఇంతకు ముందు పలు మార్లు ఇదే విధంగా జరిగింది. దీనితో ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా నియమితులైన కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమించింది. అయితే రాహుల్ గాయం రిషబ్ పంత్ కు మంచి చేస్తుందా అంటే.. అది పూర్తిగా పంత్ జట్టును నడిపించే విధానంలో ఉంటుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను సమర్థవంతంగా నడిపించి ప్లే ఆప్స్ కు దగ్గరగా తీసుకు వెళ్ళాడు. కానీ కీలక మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిపోవడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది ఢిల్లీ.

ఐపీఎల్ లో టీం ను నడిపించడం వేరు... ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ప్లేయర్స్ ను తనకన్నా సీనియర్ ప్లేయర్స్ ను నడిపించడం వేరు. అయితే పంత్ ఐపీఎల్ కు ఇక్కడకి ఏమైనా తేడాను చూపిస్తాడా లేదా అదే పంథాలో తన కెప్టెన్సీ ఉంటుందా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: