2021 టి20 వరల్డ్ కప్ లో టీమిండియా  ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘోరపరాభవం చేదు అనుభవాల నుంచి టీమిండియా అభిమానులు  ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే మరికొన్ని రోజుల్లో ఇక 2022 టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.


 ఇకపోతే ఎప్పటిలాగానే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది  వీళ్లిద్దరు పేలవ ప్రదర్శన కనబరిచిన రుతురాజ్ ఇషాన్ కిషన్ లాంటి వారికి ఛాన్స్ ఇవ్వడం లాంటి   ప్రయోగాలకు చెక్ పట్టే అవకాశం దాదాపు ఉండకపోవచ్చు అని చెప్పాలి.  కోహ్లీ ఎప్పటిలాగానే అచ్చు వచ్చిన మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు. ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ నెలకొంది. ఏడో స్థానంలో వికెట్ కీపర్ పంత్ కు స్థానం దక్కుతుంది..



 తర్వాత ఆల్రౌండర్గా  మంచి గుర్తింపు సంపాదించుకున్న హార్దిక్ పాండ్యా తో పాటు రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కే అవకాశం ఉంది  మహమ్మద్ షమీ బుమ్రా హర్షల్ స్థానాలు టీమ్ ఇండియా ఆడబోయే వరల్డ్ కప్ జట్టులో పదిలం అని అంటున్నారు విశ్లేషకులు. 2021 టోర్నీలో భువనేశ్వర్ ను ఆడించి చేతులు కాల్చుకుంది టీమిండియా  ఈసారి మాత్రం అలాంటి మిస్టేక్ చేయదు అని అనుకుంటున్నారు విశ్లేషకులు.


 ఆస్ట్రేలియాలో స్పిన్ కు పిచ్ లు  పెద్దగా సహకరించవు కాబట్టి  చాహల్ మాత్రమే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది  కుల్దీప్ యాదవ్, రవి బిష్ణయ్ లాంటి స్పిన్నర్లు వరల్డ్ కప్ క్రికెట్ లో ఎంపికైన తుది జట్టులోకి రావడం కష్టమేనని తెలుస్తోంది  మొత్తంగా ఐపీఎల్ లో చోటు దక్కించుకునే ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్, జస్ప్రిత్ బుమ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: