సౌత్ ఆఫ్రికా తో టీమిండియా ఆడబోయే టి20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో టీమ్ ఇండియా టి20 వన్డే సిరీస్ లో క్లీన్స్వీప్ చేసింది దక్షిణాఫ్రికా.  ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాకు కూడా అలాంటి ఓటమి రుచి చూపించాలని భావిస్తోంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇక సౌత్ ఆఫ్రికాను ఓడించేందుకు ఎంతో పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంది అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు టీమిండియాకు వరుసగా షాకుల తగులుతూ ఉండటం గమనార్హం. ఇండియాలో కీలక ఆటగాళ్లు గా ఉన్న వాళ్ళు ప్రస్తుతం గాయాల కారణంగా జట్టు దూరమవుతున్నారు.


 ఇప్పటికే  టీమిండియాలో సీనియర్లు గా ఉన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బుమ్రా లాంటి వాళ్లకు విశ్రాంతి ఇచ్చారూ బీసీసీఐ సెలెక్టర్లు. ఇక టీమిండియా జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ను తాత్కాలిక కెప్టెన్ గా నియమించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్లో లక్నో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించిన కె.ఎల్.రాహుల్ ఇక ఇప్పుడు టీమిండియాకు కూడా విజయం అందిస్తాడు అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా కె.ఎల్.రాహుల్ చివరికి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఇక సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇకపోతే సౌత్ ఆఫ్రికాతో టి20 సిరీస్ ఇండియా కు మరో ఎదురు దెబ్బ తగిలింది అని తెలుస్తూ ఉంది. జట్టులో కీలక స్పిన్నర్ గా ఉన్న కుల్దీప్ యాదవ్ కూడా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడని అతడు కోలుకోవడానికి సమయం పడుతుందని బిసిసిఐ చెప్పుకొచ్చింది. ఇద్దరు కీలకమైన ఆటగాళ్ల దూరమైన నేపథ్యంలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: