ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా నాకౌట్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. ఇక ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ ఝార్ఖండ్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది అనే చెప్పాలి. దీంతో ఇక తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్లో అడుగు పెట్టడం గమనార్హం. జూన్ 14 నుంచి 18 మధ్య జరగబోయే తొలి సెమీ ఫైనల్ లో బెంగాల్ జట్టు మధ్యప్రదేశ్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇక మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో ముంబై -ఉత్తరప్రదేశ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది.


 అయితే ఈ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది బెంగాల్ జట్టు. అయితే టీమిండియా క్రికెటర్ బెంగాల్ క్రీడా మంత్రి అయినా మనోజ్ తివారి సెంచరీ తో ఆకట్టుకోవటం హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. 129 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బెంగాల్ జట్టు చాలా అద్భుతమైన సెంచరీ తో గట్టెక్కించాడు మనోజ్ తివారి. 152 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్సర్ సాయం  తో సెంచరీని అందుకున్నాడు.


 ఇక మొత్తం గా 185 బంతుల్లో 19 ఫోర్లు 2 సిక్సర్లు సహాయం తో 136 పరుగులు చేశాడు మనోజ్ తివారి. ఇలా టీమిండియాలో ఎక్కువగా సక్సెస్ కాకపోయినప్పటికీ జట్టు రంజీ ట్రోఫీలో ఆడి ఏకంగా క్రీడాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో మంచి ప్రదర్శన చేసి సెంచరీతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం మనోజ్ తివారీ చేసిన ప్రదర్శన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: