మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు బ్యాట్స్మెన్లు కొట్టే సిక్సర్లు స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు గాయాలు చేయడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఇలాంటి ఘటన ఏదైనా జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహా ఒక ఘటన జరిగింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా ఆదిత్య ఇంగ్లాండ్ న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. కాగా ఇటీవలే ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.


 ఈ క్రమంలోనే మ్యాచ్  ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ కొట్టిన ఒక భారీ సిక్సర్ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తూన్న ఒక మహిళ చేతిలోని బీరు గ్లాసులో పడిపోవడం గమనార్హం. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 51 ఓవర్ వేసిన జాక్ లీచ్ బౌలింగ్లో  డారిల్ మిచెల్ స్ట్రైట్ గా భారీ సిక్సర్ కొట్టాడు.. ఈ క్రమంలోనే బంతి నేరుగా గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న అభిమాని వరకు వెళ్ళింది. చివరికి సరిగ్గా ఆమె తాగబోతున్న బీర్ క్లాస్ లో పడింది. దీంతో ఒక్కసారిగా సదరు మహిళ షాక్ అయింది.



 ఇక ఇలా క్రికెట్ బంతి పడటంతో క్లాస్ మొత్తం పగిలిపోయింది. అందులో ఉన్న బీర్ అంతా కూడా కింద పోయింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు మ్యాచ్ లైవ్ లో  తన సహచరులకు ఏం జరిగిందన్న విషయం సైగలు చేస్తూ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న న్యూజిలాండ్ జట్టు అభిమానికి కొత్త బీరు అందజేయడం గమనార్హం. ఈ వీడియో చూసిన తర్వాత సిక్సర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి బీర్ గ్లాస్ లో ఎలా పడింది అబ్బ అని అనుకుంటున్నారు నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి: