ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా హార్దిక్ పాండ్యా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సరిగ్గా ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు కూడా ఇండియా జట్టుకు దూరమైన గాయాల బారిన పడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్య. ఇక తక్కువ సమయంలో హార్దిక్ పాండ్యా మళ్లీ పుంజుకోవడం కష్టం అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఐపీఎల్ లోకి అడుగు పెట్టాడు హార్దిక్ పాండ్యా. అతని ఆట పై నమ్మకం లేక ముంబై ఇండియన్స్ వదులుకోవడం తో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్ గా మారిపోయాడు.


 గుజరాత్ ద్వారా అతనికి అదృష్టం కలిసొచ్చింది అనే చెప్పాలి. ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా గొప్ప ఫినిషర్ అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఐపీఎల్ లో గుజరాత్ కెప్టెన్సి కారణంగా అతనిలో ఉన్న సారథ్య సామర్థ్యం కూడా అందరికీ తెలిసి వచ్చింది. ఇక మొదట ఈ సీజన్లోనే గుజరాతీ టైటిల్ అందించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు హార్దిక్ పాండ్య. ఎక్కడ తడబాటు లేకుండా గుజరాత్ టైటాన్స్ జట్టును ముందుకు నడిపించాడు అని చెప్పాలి. ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.


 సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో మరోసారి 11 బంతుల్లోనే 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు హార్థిక్. ఇక పోతే టీమిండియాలో తిరిగి చోటు సంపాదించడం కోసం ఎన్నో త్యాగాలు చేసానంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ స్టార్ ఆల్రౌండర్. నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు ఒక పెద్ద యుద్ధం చేసి గెలిచాను.  ఐపీఎల్ లో తొలి సీజన్ లోనే టైటిల్ గెలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఉదయం ఐదు గంటలకే లేచి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని.. ఇలా ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత వచ్చిన ఫలితం ప్రస్తుతం సంతృప్తిగా ఉంది అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. చాలా కాలం తర్వాత దేశం తరఫున మళ్లీ బరిలోకి దిగడం ఆనందంగా ఉంది. టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించడమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: