మొన్నటివరకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన జో రూట్. ఒక కెప్టెన్ గా మరోవైపు ఆటగాడిగా మాత్రమే సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే తీవ్ర విమర్శలు మధ్య కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు జో రూట్. ఇంగ్లాండ్ లో బెన్ స్టోక్స్ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఎంతో స్వేచ్చగా ఆడుతూ చెలరేగిపోతున్నాడు జోరూట్. సెంచరీల మోత మోగిస్తూ ఉన్నారు న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో కూడా రెండు శతకాలు సాధించి అదరగొట్టాడు. 2021 జనవరి నుంచి అతను పది సెంచరీలు నమోదు చేయడం గమనార్హం.


 ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు 523 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ధీటుగా బ్యాటింగ్ చేసింది.ఇక తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ నమోదు చేసిన అలీ తో కలిసి జో రూట్ సైతం 187 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది.. నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే జో రూట్ 186 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.  వికెట్ కీపర్ బెన్ స్టోక్స్ కూడా అవుట్ కావడంతో తర్వాత బ్యాట్స్ మెన్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.


 ఇదిలావుంటే ఇటీవల సెంచరీతో తో చెలరేగిపోయిన జో రూట్ ఆసక్తికర రికార్డ్ సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాదిన్నర కాలం లోనే పది సెంచరీలు చేసిన జో రూట్ ఆల్ టైం గ్రేట్ ప్లేయర్ గా మరి పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ రికార్డు కు జో రూట్ ఎసరు పెట్టాడు అన్నది తెలుస్తుంది. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ కొనసాగుతుండగా జో రూట్ ఫామ్ చూస్తే ఆ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రానున్న  రోజుల్లో జో రూట్ ఎలా రానిస్తాడో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: