ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత ఇటీవలే దినేష్ కార్తీక్ టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతని కెరీర్ ముగిసిపోయింది అని.. అతను కామెంటేటర్ గా కొనసాగడం బెటర్ అంటూ విమర్శలు వచ్చాయి. కాగా దినేష్ కార్తీక్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించాడు. తనలో దాగివున్న అసలు సిసలైన ఫినిషర్ ను బయట పెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ ఐపీఎల్ ఆడుతున్న సమయంలో అతనికి టీమిండియా లోకి  తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా ఎక్కువ అయ్యాయి.


 ఇక అందరూ అనుకున్నట్లుగానే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత లేటు వయసులో టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు దినేష్. ఒకవేళ టీమిండియాలో అద్భుతంగా రాణించాడు అంటే ఈ ఏడాది ఆస్ట్రేలియా  వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ లో కూడా అతనికి చోటు దక్కడం ఖాయం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా లో ఆడుతున్న టి20 సిరీస్ లో దినేష్ కార్తీక్ ప్రదర్శన ఎలా ఉంది అన్న విషయం పైనే ఉంది అందరి చూపు ఉంది అనే చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దినేష్ కార్తీక్ తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలోనే మీకు ఎగిరి పోవడం ఇష్టమా లేక ఎవరైనా బుర్ర చదవడం ఇష్టమా అంటూ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా వెళ్ళిపోతా.. ఎందుకంటే ఆ ప్రాంతం గురించి ఎంతో విన్నాను. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుర్ర చదివేస్తాను అంటూ దినేష్ కార్తీక్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఇక మరికొన్ని ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానం చెప్పాడు  ఈ సీనియర్ ప్లేయర్..

మరింత సమాచారం తెలుసుకోండి: