ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా తెర మీదికి వచ్చిన యువ ఆటగాళ్లలో రియాన్ పరాగ్ ఒకరు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శన చేయ లేక పోయినప్పటికీ అతని ప్రవర్తన కారణంగా ఐపీఎల్ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులుగా మారిపోయాడు. ఐపీఎల్ లో తన ప్రవర్తనతో విమర్శల పాలు అయినా రియాన్ పరాగ్ ఇక ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తను ఇంకా కుర్రాడినే అని.. ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది అంటూ రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ రియాన్ పరాగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నేను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయాలు సాధించడం ఎంతో ముఖ్యం.. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో నేను రెండు మ్యాచ్ లలో అర్థ సెంచరీలు చేశాను. కానీ అది సరిపోదు. టోర్నమెంటులో ఒంటిచేత్తో ఆరేడు మ్యాచ్లు గెలిపించగలిగితే అప్పుడు నాకు గుర్తింపు వస్తుంది. ఇప్పటికైతే నా పేరు భారత జట్టు ప్రాబబుల్స్ లో వచ్చిన నేను దానికి అనర్హుడను అని అనుకుంటున్నాను.


 ప్రస్తుతం నా బ్యాటింగ్ తో ఎంతో సంతోషంగానే ఉన్నానని.. కానీ ఫాంపై మాత్రం హ్యాపీగా లేను అంటూ స్పష్టం చేశాడు. తమ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేయటం లేదని బాధ అయితే మనసు లో ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టమని.. ఒక్కసారి మీరు చూస్తే ఆ స్థానంలో వచ్చే బ్యాట్స్ మెన్ లకు గుర్తింపు వస్తుంది. ఫినిషెర్ గా క్రికెటర్లలో ధోనికీ ప్రత్యేక గుర్తింపు.. వచ్చే సీజన్ లో అయినా ధోని గురించి.. నేను కూడా అలాగే కావాలని కోరుకుంటా.. వచ్చే సీజన్ నుంచి నా అనుభవాన్నిపయోగించి ధోనీలా రాణిస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: