నీరజ్ చోప్రా.. ఈ పేరు గుర్తుందా.. ఈ పేరును ఎలా మర్చిపోగలం చెప్పండి.. భారత్ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ కు తెరదించింది అతనే కదా.. విశ్వ వేదికపై త్రివర్ణ పతాకాన్ని  రెపరెపలాడించిన సూపర్ స్టార్ ని ఎలా మర్చిపోగలం అని సమాధానం చెబుతారు ఎవరైనా.. ఎందుకంటే నీరజ్ చోప్రా అంతలా 130 కోట్ల భారతీయులందరినీ కూడా గర్వపడేలా చేశాడు అని చెప్పాలి. గత ఏడాది జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో జావలిన్ త్రో విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు నీరజ్.


 దీంతో గోల్డ్మెడల్ సాధించాలి అనే ఎన్నో దశాబ్దాల భారత నిరీక్షణకు తెరదించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని పేరు ఒక్కసారిగా మారు మోగిపోయింది. అయితే గత ఏడాది జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో 87.5 ఎనిమిది మీటర్ల జావెలిన్ త్రో విసిరిన నీరజ్ చోప్రా ఇక రాబోయే ఒలంపిక్స్ లో మాత్రం 90 మీటర్ల జావెలిన్ త్రో విసురుతారు అంటూ ధీమా వ్యక్తం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా ఇక ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు అని తెలుస్తోంది.  ఫిన్ లాండ్ లో జరిగిన పావో నర్మీ  గేమ్స్ లో 89.30 మీటర్ల దూరం లో జావలిన్ త్రో వేసి నేషనల్ రికార్డును సృష్టించాడు అని తెలుస్తోంది.



 కాగా 2021 ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్లు జావెలిన్ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా.. ఇక గత ఏడాది మార్చిలో పాటియాలలో 88.05 మీటర్లు జావెలిన్ త్రో విసరాడు. ఇక ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. అయితే రానున్న రోజుల్లో 90 మీటర్ల జావెలిన్ త్రో విసిరిన ఆటగాళ్ల క్లబ్లో చేరాలని కోరుకుంటున్నాను అంటూ మనసులో మాట బయట పెట్టాడు నీరజ్ చోప్రా. ఇక ఇలా తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనంద పడుతున్నారు అని చెప్పాలి. రాబోయే ఒలంపిక్స్ లో కూడా అతనికి తిరుగుండదు అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: