ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి చవిచూసిన న్యూజిలాండ్ జట్టు ఇక రెండో టెస్టులో మాత్రం ఎంతో ధాటిగా ఆడింది. దీంతో ఇక న్యూజిలాండ్ రెండో టెస్టులో విజయం సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే న్యూజిలాండ్ ఇచ్చిన భారీ టార్గెట్ ను  ఎంతో అలవోకగా ఛేదించిన ఇంగ్లండ్ జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది అని చెప్పాలి.


 మొదటి నుంచి ఎంతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బెయిర్ స్టో సూపర్ శతకం తో అదరగొట్టాడు. 92 బంతుల్లోనే 14 ఫోర్లు ఏడు సిక్సర్ల సహాయంతో 136 పరుగులు చేసి అదరగొట్టేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అని చెప్పాలి. ఫలితంగా 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇలా ఇంగ్లాండ్ జట్టు సిరీస్ని చేజిక్కించుకుంది. అయితే ఆఖరి రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ గెలుపుకు 74.3 ఓవర్లలో 299 పరుగులు చేయాల్సి ఉంది. ఇక బెన్ స్టోక్స్ 74 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో సహాయంతో 75 పరుగులు నాటౌట్గా ఉన్నాడు. ఇక అలాంటి సమయంలోనే బెయిర్ స్ట్రో వేగంగా పరుగులు చేయడం మొదలుపెట్టాడు. 50 ఓవర్ లలోనే జట్టుకు విజయాన్ని అందించారు.



 ఇక అంతకుముందు న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 553 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు కూడా ఎంతో దీటుగా బదులిచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 539 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 14 పరుగుల స్వల్ప ఆధిక్యంతో లభించింది. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 284 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ కాగా ఇక ఇంగ్లాండ్ కు రెండు వందల 99 పరుగులు టార్గెట్ నిర్దేశించింది. టార్గెట్ ను ఎంతో అలవోకగా ఛేదించిన ఇంగ్లండ్ జట్టు రెండో టెస్టులో కూడా విజయఢంకా మోగించింది అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: