సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వివాదాలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థులను కవ్వింపులు దిగేందుకు మాటల యుద్ధం చేస్తూ ఉంటారు కొంతమంది ఆటగాళ్లు. ఇకపోతే ఇటీవలే విశాఖ వేదికగా జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో భాగంగా ఇలాంటి ఘటనే జరిగింది అన్నది తెలుస్తుంది. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంశీ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 3వ టి20 మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియా ను బ్యాటింగ్ కి ఆహ్వానించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఓపెనర్లుగా వచ్చిన రుద్రరాజు గైక్వాడ్, ఇషాన్ కిషన్ నుంచి మంచి ఆరంభం లభించింది. ఇద్దరు కూడా ధాటిగా బ్యాటింగ్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ 35 బంతుల్లో 57 పరుగులు చేయగా.. ఇషన్ కిషన్ 35 బంతుల్లో 54 పరుగులలో సత్తా చాటారు.  ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో తొమ్మిదో వేయడానికి వచ్చాడు స్పీన్నర్ షంషి వచ్చాడు. ఈ క్రమంలోనే 9 ఓవర్ నాలుగో బంతిని ఇషాన్ కిషన్ భారీ సిక్సర్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వేసిన బంతిని రివర్సు స్వీప్ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు.


 బంతి నేరుగా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. దీంతో మోకాళ్ళపై కూర్చుని మంచి షాట్ మిస్ అయింది అంటూ బాధపడ్డాడు. అదేసమయంలో ఇషాన్ కిషన్ దగ్గరికి వచ్చిన షంశీ తన నోటికి పని చెప్పాడు. రివర్స్ స్వీప్ షాట్ ఆడటం నీ వల్ల కాదు అంటూ అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఇక చిర్రెత్తుకొచ్చినా ఇషాన్ కిషన్ మాటకు మాట బదులిచ్చాడు. ఇక తొమ్మిదో ఓవర్లో ఆఖరి బంతిని లెగ్ ఫైన్ దిశగా బౌండరీ కొట్టిన ప్రతీకారం తీర్చుకున్నాడు ఇషాన్ కిషన్. ఇక ఈ వీడియో వైరల్ గా మార గా ప్రస్తుతం ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: