భారీ అంచనాల మధ్య ఐపీఎల్ లో బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోయింది అన్న విషయం తెలిసిందే. మొదటి నుండి పడుతూ లేస్తూ ప్రయాణం కొనసాగించినా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్ లో మాత్రం తడబడింది. ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఈ క్రమంలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది అనే విషయం తెలిసిందే.


 అయితే  వచ్చే ఐపీఎల్ సీజన్ లో మాత్రం జట్టు లో ఎన్నో మార్పులు చేయాలని భావిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్లు వదులుకునేందుకు సిద్ధమైంది.  తెలుగు క్రికెటర్ అయిన కె ఎస్ భరత్ ను రెండు కోట్లకు కొనుగోలు చేసింది.  బ్యాక్అప్ వికెట్ కీపర్గా ఎంచుకుంది. కానీ అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. రెండు మ్యాచ్ లలో అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోలేక పోయాడు. దీంతో అతన్ని వదిలేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.



 ఇక మరోవైపు 20 లక్షల కనీస ధరకు సర్పరాజ్ ఖాన్ ను ఢిల్లీ కొనుగోలు చేసింది. దేశవాళి క్రికెట్ లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ అటు ఐపీఎల్ లో మాత్రం ఒక చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు అని చెప్పాలి. డోమెస్టిక్ క్రికెట్ చూసి అతని తుది జట్టులోకి తీసుకున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలు తారుమారయ్యాయి. దీంతో అతని వదిలేయాలని జట్టు యాజమాన్యం భావిస్తోందట.


 ఐపీఎల్ లో మంచి రికార్డు కలిగి ఉన్న ముస్తాఫిజుర్ రహ్మాన్ ను కూడా రెండు కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ఎనిమిది మ్యాచ్ లలో అవకాశం దక్కించుకున్న ముస్తాఫిజుర్ రహ్మాన్ ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఒక్కో ఓవర్ కు 7.63 పరుగులు చొప్పున సమర్పించుకున్నాడు. దీంతో అతను పూర్తిగా బౌలింగ్ లో విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనికి కూడా స్వస్తి పలికేందుకు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది అన్నది తెలుస్తోంది. అదే సమయంలో జట్టులోకి కొత్త ఆటగాళ్ళను ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: