ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలో టీం ఇండియాలో ఎక్కువగా అస్థిరత కనిపించేది కాదు. విరాట్ కోహ్లీ ఉన్న సమయంలోనూ మూడు ఫార్మాట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వాడు. కాని కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ ఎప్పుడైతే కెప్టెన్సి చేపట్టాడో అప్పటి నుంచి కెప్టెన్సీ విషయంలో అస్థిరత ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పాలి. రోహిత్ గాయాల బారినపడి దూరమవడం లేదా విశ్రాంతి తీసుకోవడం లాంటి కారణాల వల్ల టీమిండియాకు కొత్త కెప్టెన్లు వస్తూనే ఉన్నారు.


 ఇలా 12 నెలల కాలంలో భారత జట్టుకి ఏకంగా ఆరుగురు కెప్టెన్ లుగా మారారూ అనేది తెలుస్తుంది. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే గాయాల బారిన టీమిండియాకు దూరమయ్యాడు. అంతకు ముందు టీమిండియా రెండు పర్యటనలకు వెళ్ళింది. దీంతో ఒక జట్టుకు కోహ్లీ కె మరో జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా మారారు. ఇక ఇటీవల ఐర్లాండ్ టూర్ కి వెళ్తున్న భారత జట్టుకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియమించింది బీసీసీఐ. కేఎల్ రాహుల్  గాయం కారణంగా దూరం కావడంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ చేపట్టాడు. ఇలా 12 నెలల కాలంలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా కెప్టెన్ గా మారిపోయారు అని చెప్పాలి.


 అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలా తరచు టీమిండియా కెప్టెన్లు మారుతూ ఉండడం ఏమాత్రం మంచిది కాదు అంటూ అటు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా బీసీసీఐ ఈ విషయంపై దృష్టి పెట్టి ఇక రానున్న రోజుల్లో జట్టును మరింత పటిష్టవంతంగా మార్చేందుకు కెప్టెన్సీ  విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బాగుంటుందని టీమిండియా అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న  రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: