సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన టీమిండియా చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో టి20 మ్యాచ్ లో మాత్రం గెలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే సిరీస్ కైవసం చేసుకోవాలంటే మిగితా రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలి అనే లక్ష్యంతో ఎంతో పదునైన వ్యూహాలను టీమిండియా సిద్ధం చేసుకుంటుంది అని చెప్పాలి.. ఈ క్రమంలోనే నేడు మరో డూ ఆర్ డై ఫైట్ కు సిద్ధమైంది.  రాజ్కోట్ వేదికగా నేడు జరగబోయే నాలుగో టి20 మ్యాచ్ టీమిండియాకు  ఎంతో కీలకంగా మారబోతుంది అని తెలుస్తోంది.


 అయితే రాజ్కోట్లో జరగబోయే 4వ టీ 20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా భావిస్తూ ఉండగా.. రాజ్కోట్ వేదికగా నే విజయం సాధించి సిరీస్ ఎగరేసుకుపోవాలని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. టీమిండియా కానీ నేడు జరగబోయే మ్యాచ్ లో మాత్రం స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విశాఖ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో అటు యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయపడ్డాడు. చేతికి గాయం అయిన కారణంగా మైదానం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు.


 అయితే అప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన ఆవేశ్ ఖాన్ సత్తా చాటు లేక పోయాడు అని చెప్పాలి. మూడు మ్యాచ్ లలో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఇప్పుడు గాయం కారణంగా ఆవేశ్ ఖాన్ జట్టు నుంచి దూరం కావడంతో అతని స్థానంలో హర్ష దీప్ కు చోటు కల్పించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పలు మార్పులతో కూడిన టీమిండియా జట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

 విశ్లేషకుల అంచనా ప్రకారం టీమిండియా జట్టు ఇలా ఉంటుందట:
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్, కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్/అర్షదీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: