ఎవరూ ఊహించని విధంగా ఇటీవలే హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా జట్టును ఎంతో సమన్వయంతో ముందుకు నడిపించి ఇక మొదట  సీజన్లోనే టైటిల్ అందించాడు. ఇక అతని కెప్టెన్సీపై వ్యూహాలు ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేశాయనే చెప్పాలి. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. హార్దిక్ పాండ్యా రానున్న రోజుల్లో టీమిండియా కెప్టెన్సీ చేపట్టడం ఖాయమని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.


 అయితే ఇలా ఐపీఎల్ ముగిసిందో లేదో అంతలోనే హార్దిక్ పాండ్యా కు టీమిండియా కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చేసింది. టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటన కోసం వెళ్లబోయే జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది అన్న విషయం తెలిసిందే. ఇలా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హార్దిక్ పాండ్యా కంటే ముందు నుండి కెప్టెన్సీ రేసులో ఉన్న ఆటగాళ్లను వదిలేసి హార్థిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడం పై అందరూ షాక్ అయ్యారు. ఏది ఏమైనా ఈ ఆల్ రౌండర్ కు కెప్టెన్సీ దక్కడంపై మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.



 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రోహిత్ అందుబాటులో లేకపోవడంతో సెలెక్టర్లు హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ అప్పగించి సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం కెప్టెన్సీని ఇష్టపడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్. నేనైతే వ్యక్తిగతంగా రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ అప్పగిస్తాను. ఎందుకంటే వ్యక్తిగతంగా అతను మంచి ప్రదర్శన చేయడంతో పాటు కెప్టెన్గా మిగతా ఆటగాళ్లు నుంచి కూడా అలాంటి ప్రదర్శన రావడానికి ప్రయత్నాలు చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్.

మరింత సమాచారం తెలుసుకోండి: