ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన బౌలింగ్ వేగంతో ఒక్కసారిగా తెర మీదికి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్. 160 కిలోమీటర్ల వేగంతో బంధువులను విసురుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాదు ఇరవై రెండు వికెట్లు పడగొట్టి మెరుగైన ప్రదర్శన చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అతని ప్రతిభకు ఫిదా అయిన భారత సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతున్న టి20 సిరీస్ కి అతని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు వరకు టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్లు ఆడితే మూడు మ్యాచ్ లలో కూడా ఉమ్రాన్ మాలిక్ ను మాత్రం బెంచ్ కే పరిమితం చేశారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఉమ్రాన్ మాలిక్ ఎంతో వేగంతో బంతులు విసురుతున్నాడు అని కానీ బోలింగ్ టెక్నిక్ మాత్రం బాగా లేదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణాఫ్రికా స్టార్ కేసర్ అన్ రిచ్ నోర్జె ఆసక్తి కర కామెంట్స్ చేశాడు. ఎవరు ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు తమ బౌలింగ్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సీనియర్ ఫేసర్. ఇటీవలే ఇండియా- సౌత్ ఆఫ్రికా మధ్య రాజ్కోట్ వేదికగా జరగబోయే టి20 మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్  లో మాట్లాడిన ఈ స్టార్ పేసర్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో బంతి వేగం కంటే జట్టును గెలిపించేందుకు వైవిధ్యమైన బంతులను సంధించడమే ముఖ్యం.


 ఒకవేళ నేను మ్యాచ్ ఆడనప్పుడు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు..  వేగం గురించి ఆలోచించాలి.. కానీ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత జట్టు కోసం మనం ఏం చేయగలమూ అన్నదే  చేసి చూపించాలి. ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలర్.. అతడిలో మంచి వేగం ఉంది. ఏం చేయగలడో ఐపీఎల్లో చేసి చూపించాడు. అతడు రాను రాను మరింత వేగంగా బౌలింగ్ చేస్తే అది మంచిది కాదు. ఇప్పుడు ఎవరు ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తున్నారు అనే  స్టేజ్ లేము. జట్టు గెలుపు కోసం ఏం చేయాలి అనేదే ముఖ్యం అంటూ  నోర్జె చెప్పుకొచ్చాడు. వేగంలో నోర్జె, ఉమ్రాన్ మాలిక్ మధ్య గత కొంత కాలం నుంచి పోటీ నెలకొంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: