గత ఏడాది అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్ ఇక ఈ ఏడాది కూడా ఢిల్లీ జట్టు కెప్టెన్గా కొనసాగాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ గాయం కారణంగా జట్టు కు దూరం కావడంతో ఇక రిషబ్ పంత్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇప్పుడు సొంత గడ్డపై సౌతాఫ్రికాతో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని బరిలోకి దిగుతోంది. కానీ టీమిండియా అనుకున్న రీతిలో మంచి ప్రదర్శన చేయలేకపోతోంది. అదే సమయంలో ఇక రిషబ్ పంత్ ఫామ్ కూడా ఎంతగానో ఆందోళనకరంగా మారిపోయింది అని చెప్పాలి.



 ఇక మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో రిషబ్ పంత్ తన ఫామ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ ని కెప్టెన్ అని అంటున్నారు. దాని కంటే ముందు అతడు టీ20 లో తన స్థానాన్ని కాపాడుకోవాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. గత కొంతకాలం నుంచి టీ20లలో  అతను పెద్దగా రాణించడం లేదు. ఐపీఎల లో ఇటు టీమిండియా లో కూడా భారీగా పరుగులు చేయడం లేదు. ప్రతిసారీ భారీ అంచనాల మధ్య బరిలోకి తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ ఉన్నాడు.


 అయితే ఇప్పటికే టీమిండియాలో కె.ఎల్.రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు వికెట్-కీపర్ లు ఉన్నారు. దినేష్ కార్తీక్ కూడా రాణిస్తే ఇండియాలో అవసరానికి మించిన వికెట్-కీపర్ లు ఉంటారు. ఈక్రమంలోనే వికెట్ కీపర్ గా పంత్ అవసరం ఇండియాకు తక్కువే. అందుకే బ్యాటింగ్లో మెరుగ్గా రాణిస్తే తప్ప అతని స్థానం టీమిండియాలో కొనసాగదు. టీ20 ఏళ్లలో రిషబ్ పంత్ మెడపై కత్తి వేలాడుతోంది. బ్యాట్ కు పని చెప్పకపోతే టీమిండియాలో చోటు కోల్పోయే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు వసీం జాఫర్.

మరింత సమాచారం తెలుసుకోండి: