అప్పుడప్పుడు క్రికెట్ లో కాస్త చిత్రమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొంత మంది ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ చేశారు అనుకునేలోపే మళ్లీ బంతిని అందుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక కొన్ని అసాధ్యమైన క్యాచ్లు అయితే ప్రేక్షకులు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటివి ఏవైనా జరిగాయంటే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కాగా ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అనే చెప్పాలి. ఇటీవల ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఇలాంటి తరహా ఘటన జరిగింది.



 ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ ఒక బౌలర్ పట్టినా లాంటి క్యాచ్ గురించి ఇప్పుడు వరకు కనీవినీ ఎరిగి ఉండరు. విలేజ్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఇలాంటి ఘటన జరిగింది.ఇంగ్లాండ్ లోనే ఆల్ ద్విక్ క్రికెట్ క్లబ్, లింగ్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య  క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఆల్ ద్విక్ జట్టుకు చెందిన అలెక్స్ రైడర్ అనే 16 ఏళ్ల యువ పేసర్ విసిరిన బంతిని బ్యాట్స్మెన్ షాట్ ఆడాడు. అయితే ఆ బంతిని సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అక్కడే గాల్లోకి లేచింది. ఇక బౌలర్ దగ్గరికి రావడం తో అతడు అందుకునే ప్రయత్నం చేశాడు. తన చేతుల్లోకి వచ్చేంతవరకు గాల్లో ఉన్న బంతిని ఎంతో దృష్టి పెట్టి చూశాడు.


 ఇలా క్యాచ్ పట్టుకోగానే అతను వెనక్కి పడిపోయాడు. ఇంతలో అతని చేతిలో నుంచి బంతి పడిపోయింది. దీంతో అందరూ క్యాచ్ మిస్ అయింది అని అనుకున్నారు. ఇక అప్పుడు ఆ బంతి కాలితో తన్నాడు దీంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బౌలర్ రెండోసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక మళ్లీ క్యాచ్ ఒడిసి పట్టాడు. ఇలా అతను పట్టిన  క్యాష్ మాత్రం అక్కడున్న వారందరినీ కూడా అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక అక్కడ ఏం జరిగింది అన్నది అటు బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా అర్థం కాలేదు. అద్భుతమైన క్యాచ్ పట్టి అతన్ని జట్టు సభ్యులందరూ కూడా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: