మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో జరగబోయే ప్రపంచకప్ మీదే అన్ని జట్లు దృష్టి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచకప్ కోసం అత్యుత్తమ జట్టును బరిలోకి దింపేందుకు అన్ని జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. భారత జట్టు కూడా  తమ జట్టులోని ఆటగాళ్లు సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంది. కాగా ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ సైతం ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ కప్ గెలవాలన్న కసితో వుంది అన్నది తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవలే ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 లో జరిగే వన్డే ప్రపంచకప్ కంటే ఈ అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ ను కైవసం చేసుకోవడం ఇంగ్లాండ్ జట్టుకు ఎంతో ముఖ్యమైనది అంటూ ఇంగ్లాండ్ వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో పదునైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు తమ జట్టు ఎంతో సిద్ధంగా ఉంది అంటూ తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం టి20 ప్రపంచకప్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ మోర్గాన్.


 ఇక ప్రపంచ కప్ గెలవటానికి జట్టులో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ తెలిపాడు. ఇలా ప్రస్తుతం తన దృష్టి మొత్తం టి20 ప్రపంచ కప్ గెలవడం పైనే ఉంది అంటూ తెలిపాడు. టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత 2023 లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ గురించి ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు ఇయాన్ మోర్గాన్. కాగా 2021లో టి20 ప్రపంచకప్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన జట్టు గా టాప్ లోనే కొనసాగుతూ ఉంది. ఇక ఈ సారి ఇయాన్ మోర్గాన్ చెప్పినట్లుగా ఇంగ్లాండ్ జట్టు టీ20 ప్రపంచకప్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: