ఐపీఎల్ అయిన, అంతర్జాతీయ క్రికెట్ అయిన అటు దినేష్ కార్తీక్ జోరు మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి. మొన్నటివరకు ఐపీఎల్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచిన దినేష్ కార్తీక్ ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో టీ20 సిరీస్ లో అవకాశం దక్కించుకుని అదరగొడుతున్నాడు. 37 ఏళ్ళ వయసులో అతని కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న వేళ దినేష్ కార్తీక్ ఆడుతున్న తీరూ ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ప్రస్తుతం సొంత గడ్డపై టీమిండియా సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతుంది.


 టీ20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ టి20 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి. మూడవ టి20 మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 31 పరుగులతో రాణించాడు దినేష్ కార్తీక్. ఇటీవలే నాల్గవ టి20 మ్యాచ్ లో మాత్రం ఏకంగా హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ ఎంతో ఆచితూచి ఆడతాడు అని అనుకున్నారు అందరు.  కానీ రావడం రావడమే సిక్సర్లతో చెలరేగిపోయాడు.


 కేవలం 27 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలా దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 2 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఇక ఈ హాప్ సెంచరీతో దినేష్ కార్తీక్ ప్రపంచ క్రికెట్లో అరుదైన రికార్డును నమోదు చేశాడు. పెద్ద వయసులో టీ20 లో హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. ప్రస్తుతం దినేష్ కార్తీక్ వయసు 37 సంవత్సరాలు 16 రోజులు. ఇక ఇటీవల నాలుగో టి20 మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే అంతకుముందు ధోని పేరిట ఈ రికార్డు వుండేది. ధోనీ 36 సంవత్సరాల 229 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేయగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు దినేష్ కార్తీక్. ఇక టీ20 క్రికెట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటికి ఆడుతున్న ఏకైక క్రికెటర్ దినేశ్ కార్తీక్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: