టీమిండియా ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ఇలా టీమిండియా ఖాతాలో ఉన్న అత్యున్నతమైన విజయాలలో అటు 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సారథ్యంలో భారీ అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ తర్వాత జట్టుకు అండగా ఉంటాడు అనుకున్న విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో చివరికి స్వదేశం  తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు మ్ అజింక్య రహానే కెప్టెన్సీ చేపట్టినప్పటికీ యువ ఆటగాళ్లతో అతను దిగ్గజ ఆస్ట్రేలియాతో ఏమాత్రం పోరాడగలడు అని అందరూ అనుకున్నారు.


 కానీ యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి వరుసగా రెండు మ్యాచ్లలో విజయం అందించాడు అజింక్య రహానే. అయితే సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ కు ముందు హైడ్రామా నడిచింది అన్న విషయం తెలిసిందే. కొంతమంది భారత ఆటగాళ్లు బయో బబుల్ నుండి బయటకి  వెళ్ళిన వీడియోలు ఫొటోలు వైరల్ గా మారడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. కానీ సదరు ఆటగాళ్లకు నెగిటివ్ అని తేలడంతో చివరికి ఇండియా తో కలిసి ఆడనిచ్చారు. ఇదే విషయంపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ ఫైన్ స్పందించాడు.


 నలుగురు ఐదుగురు భారత ఆటగాళ్లు ఏకంగా బయో బబుల్  చేసి బయటకు వెళ్లి సిరీస్ ను రిస్క్ లో పెట్టారు. ఇండియన్ ప్లేయర్లు దేని కోసం బయటికి వెళ్లారు తెలియదు గానీ.. నిజాయితీగ వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించాడు టీమ్ ఫైన్. ఇక ఇదే విషయంపై మాట్లాడుతూ భారత క్రికెట్ ప్లేయర్స్ వ్యవహరించిన తీరు తమ జట్టులోని ఆటగాళ్లకు  చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే ఎంతోమంది క్రిస్మస్ వేడుకలను ఫామిలీ తో జరుపుకో కుండా కేవలం బయో బబుల్ కీ మాత్రమే పరిమితం అయితే భారత ఆటగాళ్లు మాత్రం ఇలా బయటికి వెళ్లడం చిరాకు తెప్పించింది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: