సౌత్ ఆఫ్రికా ఎన్నో కలలతో ఇండియా పర్యటనకు వచ్చింది. అందుకు తగినట్లుగానే సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్ లలో తమ సత్తా చాటి ఇండియా ను ఒక్క సారిగా ఒత్తిడి లోకి నెట్టేసింది సౌత్ ఆఫ్రికా. అయితే అంతమాత్రానికి ఇండియా వెనుకంజ వేయలేదు. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వరుసగా రెండు మ్యాచ్ లలోనూ సౌత్ ఆఫ్రికాను ఓడించి రేపు బెంగుళూరు లో జరగబోయే సిరీస్ డిసైడర్ కు రెండు టీమ్ లు సన్నద్ధం అయ్యాయి. రేపు ఎవరు అయితే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారే టీ 20 సిరీస్ విజేతగా నిలవనున్నారు.

అయితే ఈ సిరీస్ లో ఇండియా కెప్టెన్ గా వ్యవహారిస్తున్న రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపించడంలో సక్సెస్ అవుతున్నా, ఒక బ్యాట్స్మన్ గా మాత్రం ఫెయిల్ అవ్వడం భారత అభిమానులకు మింగుడుపడని అంశం. ఇక ఒక్క పంత్ మాత్రమే కాదు... ఈ సిరీస్ లో స్థాయిక తగిన ఆటను కనబరచని వారిలో శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లు కూడా ఉన్నారు. అయితే ఈ సిరీస్ మొత్తంలో హార్దిక్ పాండ్య మరియు దినేష్ కార్తీక్ లు తమ అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ లను గెలిపించారు. ఇక ఆఖరి మ్యాచ్ లో ఎవరు రాణిస్తారో చూడాలి.

ఇక సౌత్ ఆఫ్రికా కూడా దెబ్బతిన్న పులిలా సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్ లు ఉన్న సౌత్ ఆఫ్రికా గత రెండు మ్యాచ్ లలో బాగా తడబడింది. ముఖ్యంగా బావుమా, వండర్ డస్సెన్, మిల్లర్ లు వరుసగా విఫలం కావడం మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణాలు అని చెప్పాలి. అయితే రేపు బెంగుళూరు లో జరగనున్న నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత బౌలర్ల దెబ్బకు సఫారీలు తోకముడుస్తారా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: