ప్రస్తుతం టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసిపోయాయ్. ఈ నాలుగు మ్యాచ్ లలో టీం ఇండియా రెండు గెలిస్తే సౌత్ ఆఫ్రికా రెండు గెలిచింది. దీంతో ఇక నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో ఉన్న కొంత మంది ఆటగాళ్లు విఫలమౌతున్న తుది జట్టులో మాత్రం మార్పు కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కు టీమిండియాలో మార్పులు ఉంటాయని అంచనా వేయడం తప్ప ఒక్క మార్పు కూడా లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతుంది.


  ఐపీఎల్ లో రాణించి  టీమిండియాలో అవకాశం దక్కించుకున్న యువ పేసర్ ఆవేశ్ ఖాన్ వరుసగా మూడు మ్యాచ్ లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అని చెప్పాలి. దీంతో అతన్ని పక్కన పెడతారు అని అందరూ అంచనా వేసిన అటు మేనేజ్మెంట్ మాత్రం అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఇక బెంగళూరు వేదికగా జరగబోయే మ్యాచ్ లో కూడా ఇదే జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది. ఇటీవలే నాలుగో మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆవేశ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 గత 4 మ్యాచ్ లలో  జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈ క్రెడిట్ మొత్తం కోచ్ రాహుల్ ద్రావిడ్ కే దక్కుతుంది. ఆయన అందరికీ అవకాశాలు ఇస్తారు. దానినే చాలాకాలంపాటు కొనసాగించేలా కృషి చేస్తాడు. ఒకటి, రెండు మ్యాచ్ లలో విఫలమయ్యారని ఆటగాళ్లను మార్చడం ఆయన ఎప్పుడు చెయ్యరు. ప్రతి ఒక్కరికి తమను తాము నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తారు. మూడు మ్యాచ్ లలో నాకు ఒక వికెట్ దక్కలేదు. కానీ రాహుల్ ద్రావిడ్ నా మీద నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చారు. ఇక నాలుగో మ్యాచ్ లో  నాలుగు వికెట్లు తీయగలిగాను అంటూ ఆవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.  నాలుగో టి20 మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: