గత ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి ఎన్నో ఏళ్ల భారత నిరీక్షణకు తెర దించుతూ సూపర్ హీరోగా మారిపోయాడు నీరజ్ చోప్రా. జావలిన్ త్రో  విభాగంలో బంగారు పతకాన్ని అందుకున్నాడూ అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే నీరజ్ చోప్రా పేరు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగిపోయింది. ఇక ఇలా ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా ఇప్పుడు అదే జోష్ లో దూసుకుపోతూనే ఉన్నాడు. ప్రతి ఈవెంట్ లో కూడా సత్తా చాటుతూ అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల ఫిన్ లాండ్ లోని కుర్టానే గేమ్స్ లో మరోసారి దమ్ము ప్రదర్శించాడు ఈ ఇండియన్ ప్లేయర్.


 మొదటి ప్రయత్నంలోనే 86.69 మీటర్లు జావలిన్ త్రో విసిరి  ఇక బంగారు పతకాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఇక నీరజ్ చోప్రా ట్రినిడాడ్ మరియు టొబాగో కు చెందిన కిషోర్న్ వాల్కాట్, గ్రెనడా కు చెందిన ప్రపంచ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ను దాటుకుని మొదటి స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం   ఈ క్రమంలోనే కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు నీరజ్ చోప్రా. ఇక ప్రత్యర్థులు సైతం నీరజ్ చోప్రా ప్రతిభకు  ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా కు ఇది రెండవ పోటీ కావడం గమనార్హం. అంతేకాదు ఇక ఈ టోర్నీలో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా కూడా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు.



 ఇక నీరజ్ చోప్రా తో పాటు కుర్ టానే శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న జావెలిన్ ఛాంపియన్ సందీప్ చౌదరి కూడా పోటీలో పాల్గొని 60.35 మీటర్ల త్రో విసిరి 8వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇకపోతే ఇటీవలే ఫిన్ల్యాండ్ వేదికగా జరిగిన పావో నర్మీ  గేమ్స్ లోనూ 89.30 మీటర్లు జావలిన్ త్రో విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు నీరజ్ చోప్రా. ఏది ఏమైనా ఈ ఒలంపిక్ గోల్డ్మెడలిస్ట్ మరోసారి బంగారు పథకం గెలుచుకోవడంతో ఇక దేశ ప్రజలందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: