మొదటి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై అటు ప్రశంసల వర్షం మాత్రం ఎక్కడా ఆగడం లేదు అని చెప్పాలి. ఐపీఎల్ ముందు వరకూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని గాయాల బారిన పడి పూర్తిగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో మాత్రం సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవైపు గుజరాత్ ఐటమ్స్ కెప్టెన్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే కాదు ఇక మరోవైపు ఒక ఆటగాడిగా కూడా హార్దిక్ పాండ్య సత్తా చాటాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఎవరు కలలో కూడా ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించాడు. ఇక మొదటి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఎంతో ఒత్తిడిలో కూడా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటూ హార్దిక్ పాండ్య అందరి దృష్టిని ఆకర్షించాడు అని చెప్పాలి. ఈక్రమంలోనే హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై కెప్టెన్సీ నైపుణ్యం పై ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇటీవల ఏకంగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీమ్ ఇండియా జట్టుకు  కెప్టెన్ గా అవతరించాడు హార్దిక్ పాండ్యా.


 ఈక్రమంలోనే హార్దిక్ పాండ్యా ప్రతిభపై అటు భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒత్తిడిని ఎంతో సవాలుగా తీసుకుంటాడని జహీర్ఖాన్ ప్రశంసలు కురిపించాడు. రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగవ టి-20లో టీమ్ ఇండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆరంభం లోనే ఎక్కువ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. ఈ క్రమంలోనే 31 బంతుల్లో 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు హార్థిక్ పాండ్య. అయితే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసి నాలుగో స్థానంలో పంపిస్తే బాగుంటుంది ఇక ఒత్తిడిని జయించి హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు  అంటు జహీర్ఖాన్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: