బిసిసిఐ 2008లో ఒక సాదా సీదా దేశీయా లీగ్ గా ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లోనే అత్యున్నతమైన నాణ్యమైన దేశీయ లీగ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లో అంతకంతకు గుర్తింపు సంపాదించుకుంటూ వస్తుంది ఐపీఎల్. ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ లీగ్ గా కూడా ఐపీఎల్ కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రికెట్ పుట్టింది అగ్రదేశాల లో అయినప్పటికీ అక్కడ జరిగే దేశీయ లీగ్ లకు కూడా ఐపీఎల్ తరహాలో పాపులారిటీ లేదు అని చెప్పాలి. ఇక విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.


 ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు తమ దేశ క్రికెట్ బోర్డు పర్మిషన్ తీసుకుని మరి ఐపీఎల్ లో పాల్గొంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ లో భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లదే ఎక్కువగా హవా నడుస్తోంది. ఇక ఐపీఎల్ లో పాల్గొంటే కోట్ల రూపాయల ఆదాయంతో పాటు మంచి అనుభవం కూడా సాధించవచ్చు అని భావిస్తూ ఉంటారు.  అయితే ఇటీవలే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం జరగగా ఈ వేలంలో బిసిసిఐకి దక్కిన ప్రసార హక్కుల విలువతో ఐపీఎల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏకంగా ప్రసార హక్కుల కు గాను 48 వేల మూడు వందల తొంభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది బిసిసిఐకి.


 కాగా ఇలా ఒక్కో మ్యాచ్ విలువ 107 కోట్ల రూపాయలు గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ విలువ పెరుగుతుందని మొదట్లో చెబితే అందరూ తనను చూసి నవ్వారూ అని.. కానీ ఇప్పుడు వాళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు అంటూ లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు. 2023-27 కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కుల విలువ 48390 కోట్లు కాగా.. ఇక ఆ తర్వాత పిరియడ్ 2027-31  కాలానికి గాను ఐపీఎల్ విలువ లక్ష కోట్లు పెరగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు లలిత్ మోడీ. ఐపీఎల్కు ప్రతి ఏటా కొత్త అభిమానులు వస్తున్నారని వారిని ఎంగేజ్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl