ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత ఇటీవలే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు సీనియర్ దినేష్ కార్తీక్. ఐపీఎల్ లో ఏ ఆటను చూసి అయితే సెలెక్టర్లు టీమిండియాలో అవకాశం కల్పించారో ఇక టీమిండియా తరపున కూడా అదే ఆటను కొనసాగిస్తున్నాడు దినేష్ కార్తీక్. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టి-20 మ్యాచ్ లలో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా నాలుగవ టి20 మ్యాచ్ లో 27 బంతుల్లో 55 పరుగులు చేసిన ఆశ్చర్యపరిచాడు. దీంతో ఇక దినేష్ కార్తిక్ పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఇదే విషయంపై స్పందించాడు . దినేష్ కార్తీక్  నాలుగో టి20 నాచు లో హాఫ్ సెంచరీతో మెరవడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా జట్టులో ఇప్పటికే దినేష్ కార్తీక్ తన చోటుని ఖాయం చేసుకున్నాడు అంటూ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు  దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 లో దినేష్ కార్తీక్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన విధానం బాగా నచ్చింది. ఆరో స్థానంలో వచ్చి అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు.


 అతడి నుంచి టీమిండియా ఆశిస్తుంది కూడా ఇదే అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. జట్టులో స్థానం దక్కించుకున్న అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ప్రస్తుతం దినేష్ కార్తీక్ కొనసాగుతున్నాడు.  ఇక చివరి మూడు నాలుగు ఓవర్లలో అతను మంచి పరుగులు చేస్తున్నాడు. ఇటీవల దినేష్ కార్తీక్ చేసిన హాఫ్ సెంచరీ తప్పకుండా సెలెక్టర్లలో నమ్మకాన్ని కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ల తర్వాత దినేష్ కార్తీక్ ఉంటాడు.  ఆస్ట్రేలియాలోని పిచ్ లపై 200 కంటే ఎక్కువ పరుగులు ఛేదించడం లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఉపయోగపడుతుంది అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: