సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రతి విషయం పై కూడా అటు ప్రేక్షకులకు కాస్త ఎక్కువగానే పట్టింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే చిన్న చిన్న విషయాలను కూడా తెరమీదకు తీసుకు వస్తూ కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లను ట్రోలింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇటీవలే సౌతాఫ్రికాతో సిరీస్లో భాగంగా అటు టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన రిషబ్ పంత్ పై కూడా ఇలా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవలే బెంగుళూరు  వేదికగా 5వ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.  ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ ఓడిపోయాడు కెప్టెన్ రిషబ్ పంత్.


 దీంతో ఒక అవమానకరమైన రికార్డును రిషబ్ పంత్ ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఒక ద్వైపాక్షిక సిరీస్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు టాస్ ఓడిపోయినా తొలి కెప్టెన్ గా ప్రపంచ క్రికెట్ లోనే చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు  రిషబ్ పంత్. మహిళల పురుషుల క్రికెట్ లో కూడా ఇలా ఇన్నిసార్లు టాస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా వరుసగా ఐదు మ్యాచ్ లలో టాస్ ఓడిపోయినా కెప్టెన్ రిషబ్ పంత్ పై ప్రస్తుతం  సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. రిషబ్ పంత్ ను మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో పోల్చాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.


 ఎందుకంటే విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవటంలో టాప్ లో ఉన్నాడు కాబట్టి ఇక రిషబ్ పంత్ ని కూడా అతనితో పోల్చడం బెటర్ అంటూ ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే సిరీస్ విషయానికి వస్తే తొలి రెండు మ్యాచ్ లలో సౌత్ ఆఫ్రికా తర్వాత రెండో మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించడంతో 2-2 తో సిరీస్ సమం గా ఉంది. ఈ క్రమంలోనే ఐదో మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు సిరీస్ కైవసం  చేసుకునే అవకాశం ఉండగా.. చివరికి వర్షం   కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు విజేతలుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: