బయో బబుల్ కఠిన నిబంధనలు మధ్య తీవ్ర ఒత్తిడితో కూడిన పరిస్థితుల నడుమ గత కొంతకాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగులు చేయకుండా ఇబ్బంది పెడతున్నాడు ఏంటి అని అందరూ ప్రశ్నించారు. అయితే అతనికి కొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరం అని కొంతమంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఐపీఎల్ టోర్నీ తర్వాత అతనికి విశ్రాంతిని ఇస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది.


 ఈ క్రమంలోనే ఇక ఈ హాలిడేస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి ఒత్తిడి నుంచి బయటపడి విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి పుంజుకుంటాడని అద్భుతంగా రాణిస్తాడని ఎంతోమంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై మెక్ గ్రాత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు అంటే చాలు పరుగుల వరద పారిస్తాడు. కొన్నిసార్లు విఫలమవుతాడు. అప్పుడు అతనికి కాస్త కష్ట సమయం  ఉండవచ్చు. ఇక విరాట్ కోహ్లీకీ క్రికెట్ లో కావాల్సినంత అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా తన గురించి తన ఆట గురించి కూడా కోహ్లీకి  పూర్తి అవగాహన ఉంది.



 అలాంటి విరాట్ కోహ్లీ కొంతకాలం పాటు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు అతనికి దొరికిన విశ్రాంతి మాత్రం అతని కెరీర్ కు మంచి చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఇక కోహ్లీ తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఆడతాడో చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇక మరోవైపు మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు టీమిండియాకు ఎంతో అవసరం. ఇలాంటి సీనియర్ ప్లేయర్లే జట్టును తన అనుభవంతో ముందుండి నడిపిస్తారూ అంటు మెక్ గ్రాత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అభిమానులు కూడా కోహ్లీ మళ్లీ మునుపటి ఫాంలోకి వస్తాడని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: