ఈ ఏడాది ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత క్రికెట్ లో ఎంత వేగంతో బంతులు విసిరే బౌలర్ ఇప్పటివరకు లేకుండా పోయాడు అని చెప్పడంతో అతిశయోక్తిలేదు. దీంతో  అతన్ని వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలని.. ఆ తర్వాత వరల్డ్ కప్ లో కూడా ఆడించాలి అంటూ డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే అతని సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ను ఎంపిక చేశారు. అయితే ఐపీఎల్లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు బంతులు విసురుతూ ఐపీఎల్లో 22 వికెట్లు పడగొట్టిన ఆటగాడిని ఎందుకు పక్కకు పెట్టారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కకపోవడం పై స్పందించిన మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ముందు ఉమ్రాన్ మాలిక్ కు అటు టీమిండియాలో అవకాశం కల్పించాలని.. ఆ తర్వాత వరల్డ్ కప్ జట్టులో  సెలెక్ట్ చేయడంపై ఆలోచించాలి అంటూ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్ ఎవరూ లేరని.. అందుకే వెంటనే ఇమ్రాన్ మాలిక్ ను అటు టీమిండియా లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్.


 ఉమ్రాన్ మాలిక్ ను సుదీర్ఘకాలం  కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ అతను సరైన ప్రదర్శన చేయకపోతే పక్కన పెట్టకుండా. బౌలింగ్లో మరింత మెరుగులు దిద్దేందుకు జట్టు కోచ్ లు కూడా ప్రయత్నాలు చేయాలని వ్యాఖ్యానించాడు.  ఉమ్రాన్ మాలిక్ ఫిట్నెస్ కూడా జాగ్రత్తగా గమనించాలి.. బాగా ఆడితే ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయాలి.. లేకపోతే మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలి అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ కు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ ఐర్లాండ్ పర్యటనలో టి20 సిరీస్ కు కూడా  ఎంపికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: