గత కొంత కాలం నుంచి కేన్ విలియమ్సన్ పేలవమైన ఫామ్ తో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐపీఎల్ లోనే కాదు అటు న్యూజిలాండ్ జట్టుతో చేరిన తర్వాత కూడా ఎక్కడ బ్యాటింగ్ లో ఆకట్టుకోలేక పోయాడు అని చెప్పాలి. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో గెలిపించాల్సిన కెన్ విలియమ్సన్ తక్కువ పరుగులు చేసి జట్టును మైనస్ గా మారిపోతున్నాడు. ఈ క్రమంలోనే అతని పై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కేన్ విలియమ్సన్ ను న్యూజిలాండ్ సెలెక్టర్లు పక్కన పెట్టేశారు అనేది తెలుస్తుంది.  మూడు దేశాలతో తలబడపోయే జాతీయ జట్టులో కెన్ విలియమ్సన్ కు చోటు దక్కలేదు.


 విశ్రాంతి పేరుతో చివరికి సెలెక్టర్లు ఎంతో స్మూత్గా అతని జట్టు నుంచి తప్పించారు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కేన్ విలియమ్సన్ తో పాటు మరో ముగ్గురుకి కూడా విశ్రాంతి కల్పించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.  ఇక వారి స్థానంలో నలుగురు కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.  మొన్నటికి మొన్న ఐపీఎల్లో మాత్రమే కాకుండా ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా మంచి స్కోరు చేయలేకపోయాడు కెప్టెన్ కేన్ విలియమ్సన్. తర్వాత కరోనా వైరస్ బారిన పడ్డాడు కేన్ విలియమ్సన్. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంత బ్రేక్ కోరుకున్నాడు.



 ఈ క్రమంలోనే ఐర్లాండ్, నెదర్లాండ్స్,  స్కాట్లాండ్ లతో న్యూజిలాండ్ జట్టు ఆడబోయే వరుస సిరీస్లకు సంబంధించిన జట్టును  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఇక ఇలా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించినా జట్టులో కెప్టెన్గా కేన్ విలియమ్సన్ కు చోటు దక్కలేదు అని చెప్పాలి.  స్టార్ ఓపెనర్ దేవాన్ కాన్వే, ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌదీ లను కూడా జట్టులోకి తీసుకోలేదు. సుదీర్ఘకాలంపాటు క్రికెట్ ఆడుతూ వస్తున్న  ఈ సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీంతో ఐర్లాండ్లో జరగబోయే సిరీస్కు అటు టామ్ లాథం కెప్టెన్గా వ్యవహరించ పోతున్నాడు. ఇక ఈ మూడు దేశాలతో తల పడబోయే టి20 జట్టుకు మిచెల్ శాన్ట్నర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: