రంజీ ట్రోఫీలో భాగంగా రెండో సెమీ ఫైనల్ లో యశస్వి జైస్వాల్ అదరగొట్టేశాడు. గత కొంతకాలం నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తూ వస్తోన్నా యశస్వి జైస్వాల్  ఇటీవలే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో కూడా తన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి 127 బంతుల్లో వంద పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్సులో 372 బంతులలో  181 పరుగులతో సత్తా చాటాడు. ఇలా ఒకే మ్యాచ్లో ఏకంగా రెండు సెంచరీలు సాధించి ప్రస్తుతం అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు ఈ యువ సంచలనం.


 ఇలా ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించినా యశస్వి జైస్వాల్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే మ్యాచ్ లో రెండు శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు ఈ యువ ఆటగాడు. ఈ లిస్టులో క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉండటం గమనార్హం. సచిన్ తో పాటు వినోద్ కాంబ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, వసీం జాఫర్ తదితరులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ యువ ఆటగాడి పేరు ఈ సీనియర్ ఆటగాళ్ళ పక్కన చేరి పోయింది. ఇక ఇదే విషయంపై స్పందించిన యశస్వి జైస్వాల్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ వున్న రికార్డుల లిస్టులో తన పేరు చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.


 అయితే మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఈ రికార్డు గురించి తనకు అస్సలు అవగాహన లేదు అంటూ తెలిపాడు. కానీ ఇక తన బ్యాటింగ్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిన తర్వాత సహచర ఆటగాళ్లు తనకు అభినందనలు తెలుపుతూ అసలు విషయం చెప్పినప్పుడే తాను ఈ రికార్డు క్రియేట్ చేశాను అన్న విషయం తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ ను బాగా అర్థం చేసుకున్నాను అంటూ  తెలిపాడు. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకొన్నా సరే ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నా.. సెంచరీ చేయడానికి ఎక్కువ పరుగులు కూడా తీసుకున్నాను అన్న విషయం నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: