ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జూన్ 7 నుండి శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం మూడు టీ 20 లు, అయిదు వన్ డే లు మరియు రెండు టెస్ట్ లను ఆడనుంది. కానీ ఇప్పటికే టీ 20 సిరీస్ లో 2-1 తేడాతో కంగారూలు లంకను ఓడించారు. ఇక వన్ డే లలో భాగంగా మొన్నటి వరకు మూడు పూర్తి కాగా శ్రీలంక 2-1 తో ఆధిక్యంలో ఉంది. ఇక మిగిలింది రెండు మ్యాచ్ లు మాత్రమే. వాటిలో నాలుగవ వన్ డే ఈ రోజు ఇంకాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్ కంగారూలకు చావో రేవో అని చెప్పాలి. ఒకవేళ ఇందులో కనుక ఓటమి పాలైతే ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక వన్ డే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. క్రికెట్ లో ఒకప్పుడు ఉత్తమ స్థానంలో ఉన్న లంక జట్టు కొందరు ఆటగాళ్లు వీడ్కోలు పలికిన తర్వాత దారుణంగా విఫలం అవుతూ వచ్చింది.

ఇప్పుడు స్వదేశంలో ఆస్ట్రేలియా లాంటి జట్టును వరుస మ్యాచ్ లలో ఓడించి ఊపుమీదుంది. ఈ మ్యాచ్ శ్రీలంక గెలిస్తే చాలా కాలం తర్వాత అంతర్జాతీయ వన్ డే సిరీస్ గెలిచినా జట్టుగా అవతరిస్తుంది. గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ నిస్సంక మరియు కుశాల్ మెండిస్ లు మరోసారి మెరిస్తే ఆస్ట్రేలియా ను ఓడించడం అంత కష్టం కాదు. ఇక ఫాస్ట్ పిచ్ లపై చెలరేగి ఆడే ఆస్ట్రేలియా శ్రీలంక లాంటి స్లో ట్రాక్ లపై పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడుతోంది. ఇక బౌలర్లు కూడా గత మ్యాచ్ లో వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డారు.

మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని.. శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన లంక ఎదురీదుతోంది. బ్యాటింగ్ లో తమ కంటే బలంగా ఉన్న ఆస్ట్రేలియా ముందు పటిష్టమైన ల్కక్ష్యాన్ని ఉంచితేనే గెలిచేందుకు ఛాన్సెస్ ఉంటాయి. మరి మూడు వి కెట్లు కోల్పోయిన శ్రీలంక భారీ స్కోర్ చేసి ఆసీస్ ను ఓడిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: