శ్రీలంక మరియు ఆస్ట్రేలియా ల మధ్య కొలంబోలో నాలుగవ వన్ డే జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరన్ ఫించ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇక గత మ్యాచ్ లో సాధించిన విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన శ్రీలంక మొదటి పవర్ ప్లే లోపే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత అసలంక మరియు ధనుంజయ డిసిల్వా లు అద్భుతంగా పోరాడి 4 వ వికెట్ కు 101 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి శ్రీలంకను ఆదుకున్నారు. ఆ తర్వాత అనవసర షాట్ కు పోయి డిసిల్వా అవుట్ అయ్యాడు.. ఆ వెంటనే లేని పరుగుకు పోయి కెప్టెన్ శనక రన్ అవుట్ గా వెనుతిరిగాడు.

ఈ దశలో అసలంకకు జతగా అంతగా అనుభవం లేని ప్లేయర్ వెల్లలగే క్రీజులోకి వచ్చి అద్భుతముగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. అయితే పరుగులను పెంచే క్రమంలో భారీ షాట్ ఆడి అతను కూడా పెవిలియన్ చేరాడు. ఇలా శ్రీలంక వరుస వికెట్లు కోల్పోతున్నా అసలంక మాత్రం నెమ్మదిగా ఆడుతూ సెంచరీ (110) పరుగులు సాధించి శ్రీలంకకు పోరాడగలిగే స్కోర్ ను అందించాడు. అలా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్ లలో 258 పరుగులు చేసింది.

ఒక దశలో శ్రీలంక కనీసం 230 అయినా చేస్తుందా అనిపించింది. కానీ అసలంక పోరాటంతో ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇప్పుడు భారమంతా లంక బౌలర్లపైనే పడింది. ముఖ్యంగా గత మ్యాచ్ లో రాణించిన వాండర్స్ , మహీష్ తీక్షణ మరియు హాసరంగా ల మీదనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టులో మొత్తం 9 మంది బ్యాట్స్మన్ లు ఉన్నారు. మరి వీరిని అడ్డుకుని శ్రీలంక రికార్డు విజయాన్ని సాధించి, చాలా కాలం తర్వాత వన్ డే సిరీస్ విజయాన్ని అందుకుంటుందా అన్నది తెలియాలంటే ఇంకాస్తసేపు ఆగాల్సిందే. . 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: