జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్ లో కూడా తనదైన శైలిలో ప్రదర్శన చేస్తూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లను కూడా మెప్పించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఇటీవలే యువ ఆల్ రౌండర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డాడు అన్న విషయం తెలిసిందే.


 చేతికి గాయం అయిన కారణంగా ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఇన్ని రోజుల పాటు రిహబిలెషన్ లో ఉన్న వాషింగ్టన్ ప్రస్తుతం కోలుకున్నాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో వాషింగ్టన్ సుందర్ అటు ఇంగ్లాండ్ బయలుదేరబోతున్నాడు అంటూ బిసిసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ వెళ్లబోతోంది అక్కడ వరుసగా సిరీస్ లను ఆడబోతున్న టీమిండియా కోసం అనుకుంటే మాత్రం పొరబాటే.. ఎందుకంటే  ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఆడేందుకు వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ వెళ్ళపోతున్నాడు.



 గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడం తో ఇంగ్లాండ్ కౌంటీ జట్టు లంక షైర్ వాషింగ్టన్ సుందర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.  త్వరలో ప్రారంభం కాబోతున్న కౌంటీ సీజన్లో ఆడేందుకు వెళ్ళిపోతున్నాడు వాషింగ్టన్ సుందర్. ఇక్కడ కౌంట్ క్రికెట్లో బాగా రాణించి మళ్లీ టీమిండియా లోకి రావాలని  ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ యువ ఆటగాడు. కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన సత్తా చాటి ఒక్కసారిగా  వాషింగ్టన్ సుందర్ వెలుగులోకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే.  ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బిసిసీఐ వర్గాలు చెబుతున్నాయి. అతను కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: