ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ బౌలర్లు అందరికీ కూడా సింహ స్వప్నంలా ఉంటాడు అని చెప్పాలి. ఒక్కసారి బరిలోకి దిగారు అంటే చాలు పరుగుల వరద పారిస్తూ బౌలర్లతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. అందుకే విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయాలి అంటే చాలు స్టార్ బౌలర్లు సైతం ఒత్తిడిలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ సృష్టించే విధ్వంసం అలా ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అందుకే రికార్డుల రారాజు గా పేరు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 ప్రపంచ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయాలంటే ఎంతో మంది భయపడుతూ ఉంటారు. కానీ కొంతమంది యువ బౌలర్లు  మాత్రం తన కెరియర్ లో ఒక్కసారైనా సరే విరాట్ కోహ్లీ వికెట్ పడగొడితే చాలు అని భావిస్తూ ఉంటారు. అలాంటి అవకాశం వచ్చిందంటే చాలు ఎంతో అత్యుత్తమ ప్రదర్శన చేసి కోహ్లీ వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కోహ్లీ వికెట్ పడిందంటే ఇక తన కెరియర్ మొత్తానికి ఎంతో ప్రత్యేకం అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఒక యువ బౌలర్ ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా అక్కడ టీమిండియా లిస్టర్ షైర్ తో  నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్లో లీస్టర్ షైర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్లు ప్రదర్శన తో అదరగొట్టేశాడు. అయితే తన కెరీర్ లోనే మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న 21 ఏళ్ల వాకర్ ఇక ఐదు వికెట్లలో అటు విరాట్ కోహ్లీ వికెట్ ను కూడా పడగొట్టడం గమనార్హం.  ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే మేటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వికెట్ నా జీవితకాలం గుర్తుండిపోతుంది. మ్యాచ్ అనంతరం కొంతమంది టీమ్ మేట్స్ నాకు మెసేజ్ చేశారు. కోహ్లీ వికెట్ గురించి మనవళ్ళతో గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పారు. నిజంగానే విరాట్ కోహ్లీ వికెట్ తీశాను విషయాన్ని నా మనవళ్ళతో గర్వంగా చెప్పుకుంటాను అంటూ వాకర్ సంతోషం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: