భారత క్రికెట్లో సిక్సర్ల వీరుడు అని చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది యువరాజ్.  ఎందుకంటే అతని బ్యాటింగ్ తో అతను సృష్టించిన విధ్వంసం అలాంటిది. ముఖ్యంగా ప్రపంచ కప్ లో కీలకమైన సమయంలో ఆరు బంతులలో ఆరు సిక్సర్లు కొట్టి ఏకంగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. టి20 సిరీస్ ఆరంభమైన మొదటి ప్రపంచ కప్ లోనే టీమిండియా జట్టు సత్తా చాటిన ఏకంగా విజేతగా నిలిచింది.అన్న విషయం తెలిసిందే
 ఈ క్రమంలోనే 2007 టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా అప్పుడు బ్యాట్స్మెన్ లకు సింహ స్వప్నంలా ఉన్న బౌలర్ స్టువర్ట్  బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతులలో ఆరు సిక్సర్లు కొట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఏకంగా 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు.


 ఇలా మెరుపు ఇన్నింగ్స్ తో ఏకంగా టీమిండియాకు 200 స్కోరును దాటించాడు యువరాజ్ సింగ్. ఇక ఆ రోజు ఆ మ్యాచ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రవి శాస్త్రి  యువరాజ్ సింగ్ కొట్టిన సిక్సర్ ల పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పటికి నాకు గుర్తుంది అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.


 ఆ రోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక అదే యువరాజ్ కు కోపం తెప్పించి రెచ్చిపోయి ఆడేలా చేసింది. తొలి బంతి సిక్సర్ గా వెళ్ళింది. ఇక రెండవ, మూడవ బంతులు కూడా భారీ సిక్సర్లు బాదాడు. ఇక నాలుగో బంతి సైతం స్టాండ్స్ లోకి వెళ్ళింది. దీంతో నా పక్కనే డేవిడ్ ఫ్లూయిడ్ కుర్చీలోంచి లేచి గంతులు వేశాడు. అదే సమయంలో నేను కొట్టిన 6 సిక్సర్ల విషయం గుర్తొచ్చింది. ఇక అప్పుడు బ్యాట్స్మెన్ బౌలర్లకు ఏం ఆలోచిస్తున్నారు అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. అయిదో బంతి కూడా సిక్సర్  వెళ్లడంతో పక్కనే ఉన్న డేవిడ్ నన్ను కూడా కుర్చీ నుంచి లేపాడు.అంతలోనే యువరాజ్ సింగ్ ఆరో బంతిని కూడా సరిగ్గా మలిచాడు అంటూ రవి శాస్త్రి గుర్తుచేసుకున్నాడు. కాగా రంజిలలో 1985లో ముంబై తరఫున ఆరు బంతులలో ఆరు సిక్సర్లు కొట్టాడు రవిశాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: