గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ రద్దు అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరుదేశాల క్రికెట్ బోర్థుల పరస్పర అంగీకారం మేరకు ఇక గత ఏడాది వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ను ఇటీవల రీషెడ్యూల్ చేశారు. ఈ క్రమంలోనే ఇక టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జులై 1వ తేదీ నుంచి బర్మింగ్హామ్ వేదికగా టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇక ఈ  టెస్టు మ్యాచ్ నేపథ్యంలో గతేడాది లాగానే ఇప్పుడు కూడా ఇరు జట్లను  కరోనా వైరస్ వేధిస్తూ ఉండటం గమనార్హం.


 జట్టులో కీలక ఆటగాళ్లు గా ఉన్నవారు వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది అని చెప్పాలి. దీంతో టీమిండియా అభిమానులందరూ కూడా ఎంతగానో ఆందోళనలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో భారతిన్నావా సహా ఉపఖండ అభిమానుల కొరకు మ్యాచ్ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. వాస్తవానికి జూలై 1వ తేదీన టీమ్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు.. ఇంగ్లాండ్  లోకల్ టైం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.


 అదే ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ సమయాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ప్రకారం భారత కొలమానంలో మధ్యాహ్నం మూడు గంటలకి మార్చి ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. ఐదు రోజులపాటు జరగబోతున్న టెస్ట్ మ్యాచ్లో దాదాపు 90 ఓవర్ల ఆట సాధ్యం అయ్యే విధంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచించింది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ లో 2-1 తేడాతో జట్టు భారత జట్టు ముందంజలో ఉంది. దీంతో ఇక చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన లేదా భారత్ విజయం సాధించిన సిరీస్ భారత్ వశం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: