సరిగ్గా ఐపీఎల్ ముందు వరకు కూడా టీమిండియా కెప్టెన్సీ రేస్ లో హార్దిక్ పాండ్యా ఎక్కడా లేడు. కేవలం ఆల్రౌండర్ రేసులో మాత్రమే అతని పేరు ముందుగా వినిపించేది. కానీ ఇక ఇప్పుడు కెప్టెన్సీ రేసులోకి దూసుకు రావడమే కాదు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకున్నాడు హార్దిక్ పాండ్యా. దీనికంతటికీ కారణం ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్ అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్ లో కొత్త గా ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్ జట్టు. ఇక ఆ జట్టు కెప్టెన్ గా అవతరించాడు హార్దిక్ పాండ్యా.


 ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఎవరు కూడా ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు అని చెప్పాలి. అలాంటి సమయంలో అంచనాలకు మించి ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు హార్థిక్ పాండ్యా. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడు. దీంతో అతని కెప్టెన్సికి ఫిదా అయిన సెలెక్టర్లు ఇక ఐర్లాండ్ పర్యటన లో టీమిండియా కెప్టెన్సీ కూడా అతని చేతిలో పెట్టారు. ఇక అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఇటీవలే జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండే టీమిండియాను గెలిపించాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవలే కెప్టెన్గా హార్దిక్ పాండ్య ఒక అరుదైన రికార్డు సాధించాడు. టీ-20లో వికెట్ తీసిన తొలి భారత కెప్టెన్గా హార్థిక్ పాండ్యా నిలిచాడు. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో ఓపెనర్ స్టెర్లింగ్ వికెట్ పడగొట్టాడు హార్దిక్ పాండ్యా.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో స్టెర్లింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  దీంతో ఒక వికెట్ హార్థిక్ పాండ్య ఖాతాలో చేరిపోయింది. ఇలా కెప్టెన్గా వికెట్ పడగొట్టిన మొదటి సారధి గా రికార్డు సృష్టించాడు హార్దిక్ పాండ్యా. కాగా జట్టులో సీనియర్లు ఎవరూ లేకపోవడంతో ఇక హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ  దక్కింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: