గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ లో కనబడుతూ పరుగులు చేయడానికి తెగ ఇబ్బందులు పడిపోతున్న విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా అక్కడ ఇంగ్లాండ్తో ఆడబోయే టెస్టు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే టీమిండియా వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ వార్మప్ మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ అదరగొట్టాడు అని చెప్పాలి.


 అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అయితే ఇదే ప్రదర్శన ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో కొనసాగిస్తే ఇక అభిమానులే ఎగిరి గంతులు వేయడం ఖాయమని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఫాంపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 69 పరుగులు రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.  పరుగుల వరద పారించాడు. మొన్నటి వరకు గడ్డు పరిస్థితిల్లో ఉన్న విరాట్ కోహ్లీకి ఇప్పటికే మంచి రోజులు మొదలయ్యాయి. ఇక వార్మప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ని చూస్తుంటే తను మళ్ళి పూర్తి ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది అంటుంది వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు


 ఇకపోతే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది అనే విషయం తెలిసిందే. 2019లో వెస్టిండీస్పై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 2021లో ఇంగ్లాండు టూర్ లో  నాలుగు మ్యాచ్ లలో  రెండు వందల 18 పరుగులు చేశాడు అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇప్పుడు మునుపటి ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి తనదైన శైలిలో రాణించి  టీమిండియాను ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: