ప్రస్తుతం ఐర్లాండ్  పర్యటనలో ఉన్న భారత జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2 టి20 ల  సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇటీవలే మొదటి టీ20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. మొదటి టి20 మ్యాచ్ లో వర్షం కారణంగా మ్యాచ్ ని కేవలం 12 ఓవర్ల కు మాత్రమే కుదించారు. ఇకపోతే 12 ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 108 పరుగుల చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 9.2 ఓవర్లలోనే టార్గెట్ చేధించి ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 ఇలా మొదటి విజయంతో జోరు మీద ఉన్న భారత జట్టు ఇక రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి అటు ఐర్లాండ్ లో సొంతగడ్డపై క్లీన్స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే నేడు డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ టీమ్ ఇండియా మధ్య రెండో టి 20 మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. రెండో టీ20 మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది హార్దిక్ సేన. ఈ క్రమంలోనే సొంత గడ్డపై టీమిండియా పై ఒక విజయాన్ని సాధించి సిరీస్ సమం చేయాలని అటు ఐర్లాండ్ కూడా పట్టుదలతో ఉండటం గమనార్హం.


 ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో హాట్ టాపిక్ గా మారబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే తొలి మ్యాచ్లో మెరుపు బ్యాటింగ్ చేసిన హారీ టెక్టర్ ఇక రెండో మ్యాచ్లో కూడా కీలకంగా మారబోతున్నాడు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్ కోసం ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి మ్యాచ్ లో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురవ్వగా.. రెండవ మ్యాచ్ లో అయిన వరుణుడి కరుణ  ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: