ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా తెర మీదికి వచ్చిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. చెన్నై జట్టు ఓపెనర్ గా అతను సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఒక రకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2021 సీజన్లో చాంపియన్గా నిలిచింది అంటే అందుకు రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ కారణమని చెప్పాలి. ఐపీఎల్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్ భారత జట్టులో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీ-20 మ్యాచ్లో భారత జట్టు తరఫున ఓపెనర్ గా మారిపోయాడు రుతురాజ్ గైక్వాడ్.


 ఇకపోతే ఇటీవలే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అటు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన యువ టీమ్ ఇండియా జట్టు లో కూడా రుతురాజ్ గైక్వాడ్ భాగం అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ ఐర్లాండ్ పర్యటనలో భాగంగా బాగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మొదటి టీ20 మ్యాచ్లో అతను ఆడలేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అవకాశం తగ్గించుకున్న దీపక్ హుడా  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనర్ గా 42 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తాను ఓపెనింగ్ లో కూడా బాగా రాణించగలను అంటూ నిరూపించాడు.


 అయితే రుతురాజ్ గైక్వాడ్ ని ఎందుకు ఓపెనర్గా పంపించలేదు అన్న విషయంపై ఇటీవలే కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ కాళ్ల కండరాల్లో నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో ఓపెనింగ్ పంప లేదు అంటూ స్పష్టం చేశాడు.  కాళ్ల కండరాల నొప్పి తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతని ఓపెనింగ్ పంపించి రిస్క్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అది నాకు ఇష్టం లేదు. ఆటగాడిగా క్షేమమే  నాకు అన్నింటికన్నా ముఖ్యం.  దీంతో అతడు ఆడకున్నా మ్యాచ్ లో ఏం జరిగినా కూడా మేము రాణిస్తామని నమ్మకం ఉంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేకుండా పోయింది అంటూ కెప్టెన్ హార్థిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: