ప్రస్తుతం టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అందరి లోనూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే కెప్టెన్ గా ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటించారో అప్పటి నుండి విరాట్ ఫామ్ లో లేడు. తన కెరీర్ లో చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవల పూర్తయిన ఐపీఎల్ లోనూ అంతంత మాత్రంగానే పరుగులు సాధించాడు. అదే విధంగా గత రెండు సంవత్సరాల నుండి ఒక్క అంతర్జాతీయ సెంచరీని కూడా చేయకపోవడం గమనార్హం. దీనితో కోహ్లీ ఫ్యాన్స్ అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ లో లాస్ట్ జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ పూర్తిగా తడబడ్డాడు. కోహ్లీ ఆఖరిగా మూడు సంవత్సరాల క్రితం నవంబర్ 2019 లో సెంచరీని సాధించాడు.

ఇక అప్పటి నుండి సెంచరీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము. దీనితో కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని పలువురు సీనియర్ క్రికెటర్ల నుండి డిమాండ్ లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో గతంలో ఇంగ్లాండ్ తో జరగాల్సిన ఆఖరి టెస్ట్ జరగనుంది. కనీసం ఈ టెస్ట్ లో అయినా కోహ్లీ భారీ స్కోర్ చేయాలని జట్టు, స్నేహితులు మరియు అభిమానులు కోరుకుంటున్నారు. జులై ఒకటి నుండి ఈ టెస్ట్ జరగనుంది. ఇప్పటికే టీం ఇండియా లీసెస్టర్ షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ పర్వాలేదు అనిపించాడు.

మిగిలిన టీం సభ్యులు కూడా సరైన ప్రాక్టీస్ ను పొందారు. అయితే టెస్ట్ కు ముందు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో పెద్ద షాక్ అయింది. దీనితో ఈ టెస్ట్ కు కెప్టెన్ ఎవరు ఉంటారు అన్నది ఇంకా తేలలేదు. కాగా ఇప్పటికే ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ మరియు కొత్త కోచ్ లతో న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేసింది. దుర్బేధ్యమైన ఈ జట్టును ఇండియా ఓడిస్తుందా లేదా అన్నది తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: