ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మిగిలివున్న చివరి టెస్టు మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా రాణించి విజయం సాధిస్తుందని ప్రేక్షకులు అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ టీమిండియాను దెబ్బ మీద దెబ్బ కొట్టింది. చివరికి కరోనా వైరస్ బారినపడి ఏకంగా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐసోలేషన్ పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూలై 1వ తేదీ వరకు రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన కోలుకుంటాడు లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ ఎవరు  చేపట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా పలువురు ఆటగాళ్లు పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. జస్ప్రిత్ బూమ్రా లేదా రిషబ్ పంత్ టీమిండియా టెస్టు కెప్టెన్సి చేపట్టే అవకాశముందని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కు కెప్టెన్సీ రావడంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు   టెస్ట్ కెప్టెన్సీ కి సరైన ఆటగాడు రిషబ్ పంత్ కాదని అతనికి ఇంకా కెప్టెన్గా వ్యవహరించేందుకు పూర్తిస్థాయి పరిపక్వత సాధించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.



 ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ ఎవరనే విషయంపై మాట్లాడాల్సి వస్తే ముగ్గురు నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వాటిలో కోహ్లీ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రిషబ్ పంత్ జస్ప్రిత్ బూమ్రా లతోపాటు పూజారా పేరు కూడా వినిపిస్తోంది.. ఒకవేళ రోహిత అందుబాటులో లేకపోతే పుజారాకు కెప్టెన్సీ అప్పగించిన పర్లేదు. అది కుదరకపోతే కోహ్లీ ఉన్నాడు. ఇక అశ్విన్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే కెప్టెన్సీ భారం ఉంటే రిషబ్ పంత్ సరిగా బ్యాటింగ్ చేయలేడు..  బుమ్రా బౌలింగ్ పై ప్రభావాన్ని చూపుతోందని అభిప్రాయ వ్యక్తం చేశారు పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా.

మరింత సమాచారం తెలుసుకోండి: