టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా గత ఏడాది వైరస్ కారణంగా వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ జూలై 1వ తేదీ నుంచి ఆడేందుకు సిద్దం అవుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్లో విజయం సాధించాలని కసితో ఉంది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది అని తెలుస్తోంది.  అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే లిస్టర్ షైర్ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఇదిలా ఉంటే అటు టీమిండియా తో పోలిస్తే ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇటీవలే న్యూజిలాండ్తో ఆడిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో కూడా విజయం సాధించి 3-0  తేడాతో న్యూజిలాండ్ ను క్లీన్స్వీప్ చేసింది.


 అదే సమయంలో ఇప్పుడు కొత్త సారధి బెన్ స్టొక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగబోతోంది అని తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా సెంచరీలతో చెలరేగిపోయారు. బౌలర్ల పై వీరవిహారం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే ఇక టీమిండియాతో జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తమ జట్టు ఎలాగయితే రాణించిందో ఇక టీమిండియాతో జరగబోయే టెస్ట్ మ్యాచ్లో కూడా అదే దూకుడును కొనసాగిస్తాం మంచి ప్రదర్శన చేస్తాము అంటూ ధీమా వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్తో ఏ విభాగాల్లో మా జట్టు రాణించిందో వాటిపై మరింత దృష్టి సారించి టీమిండియా పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్థాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లు ఎంతో అలవోకగా గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్ట్ మ్యాచ్ గెలుపు కోసం మాత్రం తీవ్రంగా కష్ట పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: